HomeLaw and Orderకమిషనర్ చెప్పినా డోంట్ కేర్....తామనుకున్నది జరగాల్సిందే....కార్పొరేషన్ లో ఎవ్వరి మాట వినని టౌన్ ప్లానింగ్ అధికారులు.....

కమిషనర్ చెప్పినా డోంట్ కేర్….తామనుకున్నది జరగాల్సిందే….కార్పొరేషన్ లో ఎవ్వరి మాట వినని టౌన్ ప్లానింగ్ అధికారులు…..

నిజామాబాద్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో కొందరికి చెయ్యి తడపనిదే పని కావటం లేడంట. టౌన్ ప్లానింగ్ లో ఓ అధికారి పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఆ అధికారి దిగువ స్థాయి ఉద్యోగులతో బేరసారాలు సాగిస్తాడు. అసలే నిర్మాణరంగం కుదే లవుతోంది. ఇండ్లు అమ్ముడుపోక బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు.

అలావాటైన ప్రాణం కదా… చిన్నా చితకా ఇండ్లు కడుతూ వస్తున్నారు. అయితే పర్మిషన్ల పేరుతో… లేనిపోని కోర్రిలు పెడుతూ… బిల్డర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నారంట. మున్సిపల్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అనుమతుల (ఎన్ ఓసి) పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారంట.

అడిగింది ఇవ్వకుంటే ఇక అంతే సంగతులు.గంగాస్తాన్ కు చెందిన ఓ బిల్డర్ ఆర్టీసీ కాలనిలో 240 గజాల్లో మూడు ఇండ్లు కడుతున్నారు. వాగుకు 80 మీటర్ల దూరంలో ఉన్నా…. ఇరిగేషన్ ఎన్ ఓ సి తేవాలని కొర్రిలు పెడుతున్నారంట. దీంతో ఎన్వోసీల కోసం దరఖాస్తు చేసిన వారు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఓ బిల్డర్ అన్ని అనుమతులు తీసుకున్నా…టిపిబిఓ లు బిల్డర్లకు చుక్కలు చూపిస్తున్నారట. ప్రోహిబిషన్ లోనే… వారు రాటుతేలి పోయారoటూ బిల్డర్లు వాపోతున్నారంట. చెయ్యి తడిపితేనే పని…. మునిసిపల్ రుసుములు ముందుగానే చెల్లించినా అనుమతులు ఆలస్యం కావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిర్మానాలు నిలిచిపోతున్నాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, రుణాలపై వడ్డీ భారం అధికమవడం వల్ల అదనపు ఆర్థిక నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. మూడు శాఖల సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొంటున్నారు. సింగిల్ విండో విధానంలో నిర్దిష్ట గడువులో ఎన్వోసీ లు జారీ చేసే వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్వోసీల కోసం నూతన నిర్మాణదారుడు ఎంతైన చెల్లిస్తాడనే ఉద్దేశంతో మూడు శాఖల అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా రు. మునిసిపల్ శాఖకు ఫీజు చెల్లించిన అనంతరం ఎన్వోసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎన్వోసీ ఇవ్వకుంటే భవన నిర్మాణదారుడు చెల్లించిన డబ్బులు రిఫండ్ వచ్చేందుకు చాలాకాలం పడుతుంది. ఈ విషయంలో లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణం చేస్తున్న నిర్మాణదారులు టౌన్ ప్లా నింగ్, నీటి పారుదల, రెవెన్యూ అధికారులకు వేలల్లో రూపాయలు చెల్లించేందుకు వెనకాడడంలేదు.

నగర శివారులోని మాణిక్భండార్తండా, బోర్గాం(కే) ప్రాంతాలలో ఇంటి నిర్మాణాలకు కొర్రీలు పెడుతూ టౌన్హా నింగ్ అధికారులు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తుండగా రెవెన్యూశాఖ సర్వేయర్లు సైతం లక్షల్లో డిమాండ్ చేయడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయ్…. మున్సిపల్ కమిషనర్ హెచ్చరించినా డోంట్ కేర్….సదర్ బాధితుడు మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై గోడు వెళ్ళబోసుకున్నాడు.

అన్ని సక్రమంగా ఉన్నా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తీరు పై సీరియస్ వార్ణింగ్ కూడా ఇచ్చారంట. అయినా సదరు నిర్మాణదారుని పని కాలేదంట. బాధితుడు ఇది సంగతికి మోరపెట్టుకున్నాడు. టౌన్ ప్లానింగ్ లో ‘దీప్’o ఉన్నపుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ధోరణిలో ఉన్నాడంట ఆ అధికారి.

తన కిందిస్తాయి అధికారులను పురామాయి స్తూ… విచ్చలవిడిగా చాలా’మని’ అవుతున్నారని అంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై నిర్మాణదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారంట. టౌన్ ప్లానింగ్ లో మార్పు రాకుంటే నిర్మాణదారులు అనేక ఇబ్బందులు పడాల్సిందే అంటున్నారు. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ లో ఇదీ సంగతి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments