HomeCRIMEపెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి ........ఉస్మానియా యూనివర్సిటీ లో కలకలం

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి ……..ఉస్మానియా యూనివర్సిటీ లో కలకలం

పెట్రోల్ పోసుకొని ఓ విద్యార్ధి నిప్పంటించుకోవడం తో ఉస్మానియా యూనివర్సిటీలో కలకలం రేపింది. మైనింగ్ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న మహబూబాబాద్‌కు చెందిన వనీశ్ , యూనివర్సిటీ ప్రాంగణంలోని లేడీస్ హాస్టల్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

క్షణాల్లో మంటలు చెలరేగడంతో విద్యార్థి ఆర్తనాదాలు చేశాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన వనీశ్‌ను తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వనీశ్ శరీరంలో సుమారు 70 శాతానికి పైగా కాలిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విద్యార్ధి ఆత్మహత్య గల కారణాలను అరా తీస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments