HomeLaw and Orderనిజామాబాద్‌ నార్త్ డిప్యూటీ తహసీల్దార్‌గా అనిల్‌ వాగ్మరే

నిజామాబాద్‌ నార్త్ డిప్యూటీ తహసీల్దార్‌గా అనిల్‌ వాగ్మరే

బాధ్యతల స్వీకారంనిజామాబాద్‌ ఉత్తర (నార్త్) మండల డిప్యూటీ తహసీల్దార్‌గా అనిల్‌ వాగ్మరే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తానని, ఉన్నతాధికారుల సమన్వయంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌ వాగ్మరేను కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments