గతంలో పిడియస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డా ఉన్న సిరికొండ ఇప్పుడు దొడ్డు బియ్యం ను సన్నలుగా మార్చడానికి కేంద్రంగా మారింది. సన్నాలకు సర్కార్ ఇచ్చే బోనస్ ను మింగడానికి మిల్లర్లు పన్నాగం వేశారు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు సహకార సివిల్ సప్లై శాఖల కీలక అధికారులు సిండికేట్ గా మారారు. బోనస్ దందా ను గుట్టుగా కానిచ్చేస్తున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు విచారణ ల పేరుతొ మీనమేషాలు లెక్కిస్తున్నారు.గతంలో పిడియస్ బియ్యం మాఫియా ను పెంచిపోషించిన సిరికొండ ప్రాంత రైస్ మిల్లర్లు ఇప్పుడు రూట్ మార్చేశారు. ఈసారి బోనస్ సొమ్ముమీద కన్నేశారు.
కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము మింగేశారు.గతంలో సీఎంఆర్ బియ్యం ను పంది కొక్కుల్లా మింగేసిన మిలర్లు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన బోనస్ సొమ్ము ను రైతుల పేరుతొ మింగేస్తున్నారు సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం ఎకరానికి అయిదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పక్కాగా అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం బడ్జెట్ లోనే కేటాయింపు లు చేసింది.
ఎలాగో వడ్లు ను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడం తో అక్కడే సన్న వడ్ల కు సంబందించిన వివరాలను సంబంధిత అధికారులు పక్కాగా నమోదు చెయ్యాలి.
రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్ల ను వేంటనే సంబంధిత రైస్ మిల్ కు కేటాయించి తరలిస్తారు కేంద్రాల నుంచి వస్తున్న దొడ్డు రకం ధాన్యాన్ని, పేపర్ల మీద మాత్రం సన్న రకంగా మార్చే సిరికొండ పరిధిలోని 6 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెళ్లే లోపే ట్రక్ షీట్లపై ‘సన్న రకం’ అని రాసి ఈ దందాను పక్కాగా నడిపిస్తున్నారు.గత కొంత కాలంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది.
ముఖ్యంగా సిరికొండ ప్రాంతానికి చెందిన నాలుగు రైస్ మిల్లు ల కేంద్రంగానే ఈ దందా సాగుతుంది వీరంతా అధికార పార్టీకి చెందిన వారీగా ముద్ర ఉంది దీనికి తోడు సివిల్ సప్లై అధికారి సైతం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు సహకార సంఘాల అధికారులను సైతం తమ ముఠా లో చేర్చుకొని బోనస్ సొమ్ము మెక్కేయడానికి పక్కగా స్కెచ్ వేశారు అయితే బోనస్ నగదు రైతుల ఖాతా లోనే జమా అవుతుంది.
అందుకే అనేక మంది రైతుల ఖాతా లో సన్నబియ్యం సొమ్ము జమా అయింది తమ ఖాతాలో ఆ సొమ్ము వస్తుందో రైతులకు అర్థం కాలేదు కాలేదు కానీ అధికారులు వచ్చి ఆ సొమ్ము పొరపాటున వచ్చిందని బుకాయిస్తూ రైతుల నుంచి నగదు రూపం లోనే ఆ నగదు ను వసూలు చేసుకున్నారు కానీ కొందరు రైతులు మాత్రం ఆ సొమ్ము వెనక్కి ఇవ్వడానికి ససేమిరా అన్నారు కానీ వడ్లు అమ్మిన డబ్బులు ఇవ్వడంలో జాప్యం చెయ్యడం తో రైతులు కొందరు ఈ వ్యవహారం కలెక్టర్ దాక తీసుకెళ్లారు దీనితో గుట్టుగా సాగుతున్న ఈ బోనస్ దందా ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది.
ఇదివరకు ఉన్న కలెక్టర్ ఈ విషయమై విచారణకు ఆదేశించారు అన్నట్లుగానే ఓ ప్రజాప్రతినిది ఎంట్రీ ఇవ్వడంతో విచారణ అటకెక్కింది. నాలుగు సహకార సంఘాల్లోఈ దందా బాహాటంగా సాగుతుంది బోనస్ సొమ్ము కాజేయడానికి దొడ్డుబియ్యం ను సన్నలుగా మార్చేస్తున్నారు.
రైతుల పేరుతొ ప్రభుత్వ ఖజానా ను లూటీ చేస్తున్న వైనం ఫై కఠినంగా వ్యవహరించి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం విచారణలపేరుతొ జస్ట్ కాలయాపన డ్రామా కు తెరలేపారు
