HomeCRIMEఏసీపీ ఆఫీస్ లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏసీపీ ఆఫీస్ లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్ జరుపుల సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు .

సాయికుమార్‌ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఈ-కాప్స్‌ డ్యూటీ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌ అయ్యారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి గదిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సాయికుమార్‌ను కామినేని ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.ఈఘటనకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సాయికుమార్ మృతిచెందిన విషయం తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు . పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు .. అధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయికుమార్ తీవ్ర ఒత్తిడికి గురై ఉండొచ్చని ఆరోపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments