HomeTelanganaNizamabadఈనెల 31న నిజామాబాద్ లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభపార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మెట్టినింట...

ఈనెల 31న నిజామాబాద్ లో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభపార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మెట్టినింట కవితసభ సక్సెస్ కోసం శ్రమిస్తున్న పార్టీ శ్రేణులు

ఈనెల 31న నిజామాబాద్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించెందుకు టిఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. సభ సక్సెస్ చేయడం పార్టీ నాయకత్వం సవాల్ గా తీసుకుంది. అందుకే మెట్ పల్లి కి చెందిన డాక్టర్ రఘు ను ఇంచార్జ్ గా నియమించారు.

నిజామాబాద్ లోకసభ పరిధి లోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలను సభ కు తరలించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 26న మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్నందున సభను ఈనెల 31కు మార్చారు ఈ సభ లోపాల్గొనడానికి ఆపార్టీ అధినేత కవిత వస్తున్నారు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి గా రానున్నారు.

నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తీసుకున్న 5 లక్ష్యాలను శ్రీమతి కవిత వివరిస్తారు.పార్టీ సిద్ధాంతాలనుస్పష్టం చేయబోతున్నారు .పాంచంజన్య సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం నిజామాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశం లో సమాలోచనలు చేసారు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని శ్రేణులకు రాష్ట్ర నాయకులు సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అలీం భాయ్ తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే సభతో ప్రధాన పార్టీలకు వెన్నులో వణుకు పుట్టాలని కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ రఘు పేర్కొన్నారు.

మరో వైపు కవిత సొంత జిల్లా కావడంతో పార్టీ బలోపేతం కావడం ఫై ఉన్నస్థాయి లోనే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇప్పటి దాక క్రియాశీల నాయకులెవ్వరూ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అందుకే జిల్లాలో పార్టీ ప్రాబల్యం నామ మాత్రంగా వుందనే టాక్ ఉంది. ఈ సభ సూపర్ హిట్ చేస్తేనే పార్టీకి బూస్టప్ ఇచ్చి నట్లు అవుతుందనే అంచనాలో ఉన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments