Monday, May 4, 2026
HomePOLITICAL NEWSNationalఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది.  లెక్కింపు పక్రియ చివరి అంకానికి చేరింది.

ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది.  లెక్కింపు పక్రియ చివరి అంకానికి చేరింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన వెస్ట్ బెంగాల్ లో ఎట్టకేలకు బీజేపీ పాగా వేసింది మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ను బద్దలు కొట్టారు అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి అధికారం సాధించారు.

అలాగే మరో కీలక రాష్టం తమిళనాడులో సినిమానటుడు విజయ్ పార్టీ టీవీకే,ప్రభంజనం కనిపిస్తుంది ఇక అస్సాం,పుదుచ్చేరిలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంమొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ 171 స్థానాల్లో ఆపార్టీ ముందంజలో ఉంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కును బీజేపీ ఈగా దాటేలా కనిపిస్తోంది. సధారణంగా ఉత్తర బెంగాల్‌లోనే బలగా ఉండే బీజేపీ, ఈసారి మమతా బెనర్జీ కంచుకోట అయిన దక్షిణ బెంగాల్ లో కూడా పాగా వేసింది. జాదవ్‌పూర్, హౌరా, ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది
స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ లో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే టీఎంసీకి పట్టున్న డైమండ్ హార్బర్ సీటులో కూడా బీజేపీ ముందంజలో ఉంది.


 ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు రంగంలోకి దిగి అవినీతి, మహిళల భద్రత, నిరుద్యోగం వంటి అంశాలపై పోరాడారు. మరోవైపు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ  సంక్షేమ పథకాలను నమ్ముకుని ప్రచారం చేశారు.

డీయంకే కకావికలం

రెండో సారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న డీయంకే ఫలితాల్లో బొక్క బోర్ల పడింది ఎగ్జిట్ పోల్స్ సైతం స్టాలిన్ మరోసారి సీఎం కానున్నారంటూ ఉదరగోట్టాయి.విజయ్ 15 -20 స్థానాలకు పరిమితం అవుతారని భావించారు కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయనే అధికారం కు చేరువవుతున్నారు .

ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ 108 స్థానాల్లో లీడింగ్‎లో కొనసాగుతూ తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. 

ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే టీవీకే  105 నుంచి 110 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇతరుల మద్దతు అవసరం. కానీ డ్రవిడ భావజాల పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేతో చేతులు కలిపేదే లేదని ఎన్నికలకు ముందే విజయ్ ప్రకటించారు. 7 దశాబ్ధాలుగా పాతుకుపోయిన ద్రవిడ రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయ్ స్పష్టం చేశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!