కరీంనగర్ నగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు స్వైర విహారం చేసారు జ్యూవెలరీ షాప్ లో చొరబడ్డారు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు .అడ్డువచ్చిన సెక్యూర్టీ సిబ్బంది మీద కాల్పులు జరపడం తో అక్కడిక్కడే ఒకరు మృతి చెందారు
పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఆదివారం రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు, జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్లో పెను సంచలనం సృష్టించింది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది షాప్ యజమాని నుంచి స్పష్టత రాలేదు
