HomeCRIMEకామారెడ్డి లో భారీ అగ్ని ప్రమాదం

కామారెడ్డి లో భారీ అగ్ని ప్రమాదం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది . ఇందిరాచౌక్ వద్ద గల సుమారు 18 పూలు, పండ్ల దుకాణాలు, హోటళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోజు మాదిరిగానే శనివారం రాత్రి చిరు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు.

అయితే అర్ధరాత్రి 1 గంట తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున చెలరేగడంతో 18 షాపులకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. వేసవి కాలం కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఒకదాని తర్వాత మరొక షాపులకు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. అయితే షాపుల పక్కన చెత్తకుప్పకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments