HomeCRIMEఏసీబీ వలలో బోధన్ ఎస్సై: కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై,...

ఏసీబీ వలలో బోధన్ ఎస్సై: కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సై, ఏసీబీ అధికారులకు చిక్కారు…

బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భాస్కర చారి, డమ్మి గన్స్ తో రీల్స్ చేసిన వ్యక్తిపై నమోదైన కేసును తొలగించేందుకు రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో, చివరికి రూ. 7,000 కు ఒప్పందం కుదిరింది. అయితే, లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖఅధికారులను ఆశ్రయించారు.

పక్కా ప్రణాళిక ప్రకారం, బుధవారం బాధితుడి నుంచి ఎస్సై భాస్కర చారి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఎస్సై వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 7,000 స్వాధీనం చేసుకున్నారు.

ఎస్సై చేతి వేళ్లకు జరిపిన కెమికల్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments