నిజామాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో డీఎంఏసీ మొదటి సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి పరిచయం చేసుకున్నారు.
2026 – 2028 కాల వ్యవధికి సంబంధించి అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఈ సమావేశంలో పరిశీలన జరిపారు. 252 జీ.ఓ నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దరఖాస్తులకు కమిటీ సభ్యులు ఆమోదం పలుకగా, కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ మంజూరు చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు, అర్హులైన జర్నలిస్టులకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ద్వారా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ సజావుగా, పూర్తి పారదర్శకంగా జరగాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. తదుపరి వచ్చే దరఖాస్తులను కూడా ఇదే తరహాలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరయ్యేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఎం.ఉమేష్ చంద్రరావు, ఆర్టీసీ పీ.ఓ పద్మజ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఏ.నర్సింలు, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, సీ.హెచ్.జాన్సన్, ఎంఏ.మాజిద్, కే.రాందయానంద్, ఎండీ.గౌస్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
