HomeCRIMEఅశోక్ సాగర్‌ చెరువులో పడి బ్యాంక్ అధికారి ఆత్మహత్య..

అశోక్ సాగర్‌ చెరువులో పడి బ్యాంక్ అధికారి ఆత్మహత్య..

​నిజామాబాద్ నగరంలోని అశోక్ సాగర్ చెరువులో పడి బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గంగాస్థాన్ ఎస్‌బీఐ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కొటారికరి శ్రీధర్ ఆదివారం అశోక్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరో టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments