HomePOLITICAL NEWSతనకోసం ఎవ్వరూ రాజీనామా చెయ్యరు …….ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్

తనకోసం ఎవ్వరూ రాజీనామా చెయ్యరు …….ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్

తన కు రాజ్యసభ పంపడానికి తెలంగాణ ఎంపీ లెవ్వరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అసలు అలాంటి ప్రతిపాదనలేవి లేవని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు.

ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని తెలిపారు. తెలంగాణ నుంచి రాజీనామా చేయించినా తాను ఆ రాజ్యసభ స్థానాన్ని తాను తీసుకోనన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ లాంటి వ్యక్తుల కోసం వేరే రాష్ట్రాలు సీట్లు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

తన లాంటి వారి కోసం తెలంగాణ రాజ్యసభ స్థానాన్ని ఇస్తే.. అందుకు తాను ఒప్పుకోనని పేర్కొన్నారు.బీజేపీ, ఎన్నికల సంఘం పూర్తిగా లోపాయి కారి ఒప్పందాలు చేసుకున్నాయనీ. అందువల్లే తన నామినేషన్ తిరస్కరించారని మీనాక్షి అన్నారు.

కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. తన నామినేషన్ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని చెప్పారు.

గణపతి పాలు తాగుతున్నాడని బీజేపీ అబద్ధాలను సృష్టించిందని సోదాహరణగా వివరించారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం అని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

బయట పడిన బీజేపీ బండారం..

పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ అనేక అబద్ధాలను సృష్టించిందని అన్నారు. రాజ్యసభ నామినేషన్ రిజక్ట్ చేసినందుకు తనకేం బాధ లేదన్నారు. తన నామినేషన్ తిరస్కరించడం వల్ల బీజేపీ బండారం బయట పడిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. బీజేపీ నేతలను నామినేషన్ రూంలోని ఎలా అనుమతించారంటూ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments