HomeTelanganaNizamabadజాతీయ హాకీ క్రీడాకారిణి మమతకు ఘన సన్మానం..

జాతీయ హాకీ క్రీడాకారిణి మమతకు ఘన సన్మానం..

జిల్లా ఖ్యాతిని చాటిన ప్రతిభావంతురాలు: సీపీ సాయి చైతన్యజాతీయ స్థాయిలో ఐదుసార్లు హాకీ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన కుమారి మాలవత్ మమతను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.

కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఐదుసార్లు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని, మమత వంటి క్రీడాకారిణులు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని వివరించారు. భవిష్యత్తులో మమత అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ధర్పల్లి సీఐ బి. భిక్షపతి, సిరికొండ ఎస్ఐ జె. రామకృష్ణ, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, సెక్రటరీ రమణ, కోచ్ నగేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments