ఈరోజు మామిడిపల్లిలోని జిల్లా వంజరి కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా వంజరి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
వంజరి కుల సోదరులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పైడీ రాకేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనా చేసి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
జిల్లా వంజరి సంఘం నూతన అధ్యక్షులుగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారిగా కరిపే మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…“నా రాజకీయ ప్రస్థానంలో వంజరి కుల సోదరుల మద్దతు ఎప్పటికీ మరువలేనిది.
ప్రతి ఎన్నికల్లో, ప్రతి అడుగులో నాకు అండగా నిలిచిన వంజరి సమాజానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వంజరి సంఘం అభివృద్ధి కోసం, యువత ప్రగతి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్నివిధాలా సహకారం అందిస్తాను” అని తెలిపారు.అలాగే వంజరి సమాజం ఐక్యంగా ముందుకు సాగితే మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సభలో హర్షధ్వానాలు, జై వంజరి నినాదాలతో కళ్యాణ మండపం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశ వేణు హాజరై మాట్లాడుతూ…“వంజరి సమాజం ఐక్యతకు ప్రతీక. సమాజ అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని తెలిపారు.
ఈ సందర్భంగా వారిని కూడా సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బోనేకర్ భూమయ్య, మాజీ కార్యదర్శి మల్లేష్, మాజీ కోశాధికారి నర్సయ్య, రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్షులు కాలేరు నరేష్, కార్యదర్శి కొండల్, కోశాధికారి అమరేందర్, మాస్టర్ శ్రీనివాస్, సర్పంచ్ కూన లలిత సాగర్, గంగోనె గంగాధర్, గంగోనె సంతోష్,గోపాల్ శ్రీధర్, కరిపే గణేష్, అమంద్ విజయ్ కృష్ణ, బర్ధన్ సతీష్, నవతే సతీష్, పటేవార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం నూతన కమిటీ సభ్యులకు వంజరి సోదరులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వంజరి సమాజ ఐక్యత, అభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం కొత్త కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
