HomeCRIMEమొయినాబాద్‌ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల హత్య ......వడ్డీ వ్యాపారమే కారణమా

మొయినాబాద్‌ ఫామ్ హౌస్‌లో ఇద్దరు మహిళల హత్య ……వడ్డీ వ్యాపారమే కారణమా

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మొయినాబాద్ తోల్కట్ట గ్రామ సమీపంలో లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు మృతులది తాండూరు గా గుర్తించారు.వీరు వికారాబాద్ జిల్లా తాండూరులో మిస్సైన ట్లుగా పోలీసులు కేసు నమోదు అయింది.

తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతమైన చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి పూడ్చివేసి నట్లుగా భావిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఫైనాన్స్ వివాదంలోనే ఈ హత్యలు జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తాండూరు నుంచి మొయినాబాద్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments