నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) గీతను జీపీఓల (గ్రేడ్-II పంచాయతీ కార్యదర్శులు/గ్రూప్ పంచాయతీ అధికారులు) సంఘం జిల్లా నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
డీఆర్‌ఓ కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ గీత మాట్లాడుతూ.. జిల్లాలోని జీపీఓలందరూ సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ, ప్రభుత్వానికి, రెవెన్యూ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.డీఆర్‌ఓను సత్కరించిన వారిలో జీపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు బియ్య సాయినాథ్, ప్రధాన కార్యదర్శి గున్నం సంతోష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా ఉపాధ్యక్షులు నీరడి రమేష్, అఫ్రోజ్, గిరి, రాజేశ్వర్, రాకేష్, రజిత, హరిచరన్, అరుణ, అనిత, జ్యోతి, సుమన్‌తో పాటు జిల్లాలోని పలువురు జీపీఓలు పాల్గొన్నారు.
