బదిలీ చేసిన స్థానం లోకి వెళ్లకుండా పూర్వ స్థానంలోనే కొనసాగుతున్న హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై పని చేస్తోన్న డిప్యూటీ కలెక్టర్ షర్మిలను సస్పెండ్ చేస్తూ సీసీఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల జరిగిన సాదారణ బదిలీల్లో ఆమెను ఉట్నూరు ఆర్డీవోగా,. నియమించారు. ఆమె ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ పనులపై తీవ్ర ప్రభావం పడింది. ఉట్నూరుకు వెళ్లకుండా హెచ్ఎండీఏలోనే తిష్ట వేశారు. నిజానికి వృత్తిపరంగా ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లాలి.
ఈ క్రమంలోనే ఆమెను ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లకుండా జాప్యం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది . ఆమెను బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లాలని అనేక సార్లు ఆదేశించినా ఖాతరు చేయలేదు. అందుకే నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారు.
