HomeTelanganaNizamabadజస్టిస్ బాలకృష్ణన్ బేటిలో పాల్గొన్న రమేష్ జాన్

జస్టిస్ బాలకృష్ణన్ బేటిలో పాల్గొన్న రమేష్ జాన్

ఢిల్లీలోని జాతీయ విచారణ కమిషన్ (National Commission) చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌తో బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం జరిపిన సమావేశంలో ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ జాన్ పాల్గొన్నారు.

దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై ఈ సమావేశం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదికను కమిషన్ చైర్మన్‌కు బిఆర్ఎస్ ప్రతినిధులు. రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మరియు మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్ లు అందజేశారు.

ఈ సందర్భంగా రమేష్ జాన్ మాట్లాడుతూ… జస్టిస్ బాలకృష్ణన్ బేటిలో బి ఆర్ ఎస్ పార్టీ క్రైస్తవ సంక్షేమం కోసం నివేదిక ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం అన్నారు.

ఇదే విషయమై ఇతర రాజకీయ పార్టీల మౌనం వహించడంపై ధ్వజమెత్తారు. అలాగే క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు బిషప్ విద్యాసాగర్, మోజెస్, సొలోమోన్, బిషప్ దుర్గం ప్రభాకర్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments