HomeEditorial Specialజిల్లాలో విస్తారంగా వర్షాలు .....ప్రాజెక్ట్ లకు పెరిగిన ఇన్ ఫ్లో ..అన్నదాతల్లో చిగురించిన ఆశలు...

జిల్లాలో విస్తారంగా వర్షాలు …..ప్రాజెక్ట్ లకు పెరిగిన ఇన్ ఫ్లో ..అన్నదాతల్లో చిగురించిన ఆశలు…

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లు తున్నాయి

జిల్లాలో నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సైతం ఎగువ నుంచి నీటి ప్రవాహం కొంత మేరకు పెరిగింది నిజాంసాగర్ కు గత నెలరోజుల్లో రెండు టియంసి లమేరకు నీరు వచ్చి చేరింది దీనితో ఆయకట్టు రైతుల్లో పంటల సాగుమీద ఆశలు చిగురించాయి

ఎలినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పంటలు వెయ్యద్దని వ్యవసాయశాఖ చెప్తుంది కానీ కానీ రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం తో రైతులు పొలం బాట పట్టారు కొంతమేరకైనా సరే అన్నటుగా నాట్లు వేస్తున్నారు

జిల్లాలో గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడం తో బోర్ల కింద పంటలు వేసే రైతులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు సిరికొండ మండలంలో కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది గతంలో దెబ్బతిన్న కొండూరు వంతెనకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు సైతం రాత్రి కురిసిన వర్షానికి కోతకు గురి అయింది రహదారి, సైతం కుంగి పోయింది దీనితో సిరికొండ మండల కేంద్రానికి వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి ధర్పల్లి మండలం వాడి వద్ద కూడా ముత్యాలమ్మ వాగు రోడ్డు మీది ప్రవహిస్తుంది.

ఎల్లారెడ్డి నాగిరెడ్డి ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో కళ్యాణి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.దీనితో గేట్లు ఎత్తి నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి నీటిని మళ్లిస్తున్నారు. ప్రాజెక్ట్ రెండు వరద గేట్ల ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 430 క్యూసెక్కులు వరద వస్తుండగా.. ఫ్లడ్ గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు 180 క్యూసెక్కులు మళ్లిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments