బావను బావమరిది హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బల పాండు అనే వ్యక్తి తన అక్కను ఆమె భర్త వెంకటేశ్ తరచూ వేధిస్తున్నాడనే ఆగ్రహంతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
ఘటన అనంతరం నిందితుడు నేరుగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
