శుభకార్యానికి వెళ్తున్న ఒక 70 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించి ఆటోలో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోచుకున్న అమానుష ఘటన నిజామాబాద్లో జరిగింది. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం నిజామాబాద్ కెనాల్ కట్ట వద్ద ఒక వృద్ధురాలు ఆటో ఎక్కింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఆటో డ్రైవర్, దారి మళ్లించి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమె మెడలోని సుమారు 2 తులాల బంగారు గుండ్ల పేరును, ఆమె వద్ద ఉన్న రూ.200 నగదును బలవంతంగా లాక్కొని పారిపోయాడు. బాధితురాలు ఇంటికి వచ్చి రోదిస్తుండగా గమనించిన ఆమె బంధువులు నిజామాబాద్ త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడైన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
