HomeHEALTHపేదల ఆరోగ్యానికి అండగా.. నిమ్స్ వైద్య చికిత్సకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఎల్వోసీ అందజేత...

పేదల ఆరోగ్యానికి అండగా.. నిమ్స్ వైద్య చికిత్సకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఎల్వోసీ అందజేత…

పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని, అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఎల్వోసి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసి ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు.

నగరంలోని గౌతం నగర్ కు చెందిన హేమగ్న మూత్ర పిండాల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రూ.2.40 లక్షల ఎల్వోసీ అందజేశామన్నారు.

పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments