HomeTelanganaNizamabadజిల్లాలో యూరియా కొరతే లేదు ....యాప్ తో నష్టం లేదు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు...

జిల్లాలో యూరియా కొరతే లేదు ….యాప్ తో నష్టం లేదు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

యూరియా యాప్ తొలగించాలని రైతులను రెచ్చగొడుతున్నారు.జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి స్పష్టం చేసారు ఈ ఖరీఫ్ పంటకు సుమారు 80,840 వేల మెట్రిక్ టన్నుల యూరియ అవసరం ఉండగా కేంద్రం నుండి వచ్చింది కేవలం 38 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే.

దానిని మేము 15 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులకు అందజేశాము. కేంద్రం ఏ విధంగా మాకు దశలవారీగా యూరియా పంపిస్తుందో అదే విధంగా దశలవారీగా రైతులకు అందిస్తున్నాము కేంద్రం ఒకేసారి ఈ పంటకు కావలసిన పూర్తి యూరియాను అందిస్తే మేము రైతులకు కూడా పూర్తి యూరియాను అందిస్తాము.

జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్ ద్వారా రైతులకు ఎకరం ఉన్నవారికి రెండు సంచులు ఒకే సారి ఇవ్వడం జరుగుతుంది.మూడు ఎకరాలు ఉన్నవారికి రెండు దశలలో ఇస్తున్నాము. ఐదు ఎకరాలు ఉన్నవారికి మూడు దశలలో మొదటి దశలో 40%, రెండవ దశలో 30%, మూడవ దశలో 30% ఇవ్వడం జరుగుతుంది.

ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు నాలుగు దశలలో యూరియా అందించడం జరుగుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఇంకా వరి నాట్లు ప్రారంభ దశలో ఉన్నాయి ఇప్పుడు పంటకు కావలసిన మొదటి దశ యూరియాను ఇప్పటికే అందించడం జరిగింది. దీని ద్వారా ఎక్కడ కూడా యూరియా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పగడ్బందీగా ప్రాణాలిక రూపొందించింది.

రైతులకు అప్ అర్థం కాకుంటే ప్రతి విలేజ్ లో గ్రామ పంచాయతీలో వ్యవసాయ అధికారులు AEO లు.. రైతుకు ఏవిధంగా యాప్ ఉపయోగించాలో వారు చెప్తున్నారు. మండల స్థాయిలో ఏవో ఉంటున్నారు.

యూరియా అధికంగా వాడడం ద్వారా క్యాన్సర్ తో పాటు ఇతర రోగాలు వస్తుండడంతో వాటిని నివారించడానికి యూరియా వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించే విధంగా రైతును ప్రోత్సహిస్తున్నాము. . సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటకు ప్రస్తుతం మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది భూములు కూడా సారవంతం అవుతుంది దీనిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సేంద్రియ ఎరువు ద్వారా పండించిన రైతులు పంటలు పండించి అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాము. యూరియా అధిక వాడకం ద్వారా పండించే పంటలు తినడం ద్వారా వచ్చే రోగాలను అరికట్టడానికి సేంద్రీయ ఎరువుల పంటలను తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జిల్లా రైతులు యూరియా సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఖరీఫ్ పంటకు కావలసిన యూరియా అందుబాటులో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments