స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల ఫై ఇద్దరు బిఆర్ యస్ ఎమ్మెల్సీ లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ‘కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలన’ను నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల టీ-షర్టులతో సభకు హాజరయ్యే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు శాసనసభ లోపలా, బయటా తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.
తెల్లవారుజామునే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని తాతా మధును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాయి. అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే క్వార్టర్స్‌తో పాటు అగ్రనేతల నివాసాలకు తరలివస్తున్నారు
