నగరంలో వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసి ముగ్గురు విటులు, ఐదుగురు విటురాళ్ల అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు ఆదివారం సిసిఎస్ ఏసీపీ (ఇంచార్జ్) మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది నగరంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో 4టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్, తెలంగాణ పార్క్ పక్కన గల ఒక నివాస గృహంలో రహస్యంగా వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటిపై మెరుపు దాడి చేసి ఈ తనిఖీల్లో అక్కడ వ్యభిచార కేంద్రం నడుస్తున్నట్లు ఆధారాలతో సహా పట్టుబడింది.
ఈ దాడిలో నిందితుల నుంచి రూ.4,870 నగదు, 7 మొబైల్ ఫోన్లతో పాటు ముగ్గురు విటులను, ఐదుగురు విటురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన నిమిత్తం 4టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
నగరంలో వ్యభిచార కేంద్రాలు, జూదం, మత్తు పదార్థాల విక్రయాలు వంటి ఎలాంటి చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
యువత చెడు అలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
