HomeLaw and Orderతెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు..

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత అధికారులకు సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని అన్నారు.

వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments