సూపర్ ఎలినో తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసిన నేపథ్యంలో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనివాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ముఖంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది.మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు రికార్డయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాత్రంతా భారీ వాన కురిసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
చల్లబడిన వాతావరణం …..రెండు రోజులు వర్షాలు పడే ఛాన్స్ …..అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
RELATED ARTICLES
