తెలంగాణ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా బదులు ఇచ్చారు. ఆయన బుధవారం సోమాజీ గూడ లో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు.అవునూ తెలంగాణ ముమ్మాటికీ మా జాగీరే ఇది ముమ్మాటికి తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అన్నారు.
తెలంగాణవిషయంలో పవన్ బెదిరింపు ధోరణి తో మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో జనసేన పోటీ చేశారని మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పవన్ పోటీ చేశారని గుర్తు చేశారు.
ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని పవన్ అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ప్రాంతీయ వాదమా? దేశభక్తి గురించి మేము పవన్ కల్యాణ్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నిజాం సర్కార్‍కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల ఇదని అన్నారు.
మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదన్నారు:పవన్ కల్యాణ్ తెలంగాణ వస్తే 11 రోజులు తినలేదన్నారు. కానీ మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించామని ఇది మా జాతీయ వాదం అన్నారు. తెలంగాణలో జాతీయ వాదం, దేశభక్తి ఉందన్నారు.
తెలంగాణకు వస్తున్న పరిశ్రమలను మోడీ గుజరాత్‍కు తీసుకెళ్తున్నారు. జాతీయవాదం పేరుతో బీజేపీ చేస్తున్న ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏమనాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా, కళాకారుడిగా పవన్ కల్యాణ్‍ను అభిమానిస్తాం, గౌరవిస్తాం. కానీ వచ్చి మా సెక్రటేరియట్‍లో కూర్చుని పెత్తనం చేస్తాం మా రాజకీయాల్లో తలదూరుస్తామంటే ఊరుకోమన్నారు.
60 ఏళ్లు పోరాటం చేసి మొన్నే కదా వేరు పడ్డది అన్నారు. తెలంగాణ డోకా లేకుండా చూసుకోవడనికి మాకు కెసిఆర్ ఉన్నారని ఆయన గుర్తు చేసారు
