నిర్మాణ పనులు పూర్తీ చేసుకున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ను అర్హులైన పేదలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం భువనగిరి మున్సిపల్ పట్టణంలోని సింగన్న గూడెం చౌరస్తా వద్ద గత ప్రభుత్వం హయాంలోనే నిర్మించిన డబుల్ బెడ్ రూం లోకి భువనగిరి పట్టణ నికి చెందిన కొందరు ప్రజలు ప్రవేశించారు.
అయితే అధికారులు రంగంలోకి దిగి తొందరలోనే ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇవ్వడం తో వెనక్కి తగ్గారు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇళ్ల కేటాయింపులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.తమకు ఇప్పటికే అర్హత ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాళీగా ఉన్న ఇళ్లను వెంటనే అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో, ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న తమకు సొంత నివాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అర్హుల జాబితాను ప్రకటించి వెంటనే ఇళ్ల పంపిణీ చేపట్టాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ సమస్యను సానుకూలంగా పరిగణించి న్యాయం చేయాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ ఇండ్లను కేటాయింపు పక్రియ గతంలో యంత్రాంగం పూర్తీ చేసింది కానీ పేదలకు ఇండ్లను అలాట్ చేసే విషయంలో ఏళ్ల తరబడిగా జాప్యం చేస్తున్నారు
