HomeCRIMEఆత్మహత్య కు యత్నించిన ట్రైనీ ఐపీఎస్

ఆత్మహత్య కు యత్నించిన ట్రైనీ ఐపీఎస్

లైంగిక ఆరోపణలు ఎందుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్నారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ( జులై 20) ఎర్రగడ్డ, మోతీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో విషయం సేవించాడు . తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డ – ఎస్ ఆర్ నగర్ లోని జయంత్ హస్పిటల్ లో ఉదయ్ కృష్ణా రెడ్డికి చికిత్స అందిస్తున్నారు.

ఆయన కు ప్రాణాపాయం తప్పినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి అయితే ఆత్మ హత్యకు ముందే ఆయన అకాడమీ లో మహిళ ఐపీఎస్ వ్యవహారంలో జరిగిన ఉదంతం ఫై సుదీర్ఘ లేఖ రాసారు

// ట్రైనీ ఐపీఎస్ ను సస్పెండ్ చేసిన నేషనల్ పోలీస్ అకాడెమీ ////


లైంగిక ఆరోపణలు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని జాతీయ పోలీసు అకాడమీ ప్రివిలేజ్ కమిటీ సస్పెండ్ చేసింది
ఉదయ్ కృష్ణా రెడ్డి ఫై గురించి మరో మహిళ ట్రైనీ ఐపీఎస్ మొదట అధికారులకు ఫిర్యాదు చేశారు మేరకు సీసీ కెమెరాలు ఆధారాలతో పాటు అన్ని ఆధారాలు సేకరించిన ప్రివిలేజ్ కమిటీ. 

అకాడమీ నుండీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వీస్ లో తదుపరి అకాడమీ లో చేరడానికి డివోపిటీదే తుది నిర్ణయం అని ఈ సందర్భంగా అకాడమీ అధికారులు చెప్పారు.ట్రైనీ మహిళా ఐపీఎస్ పై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిమీద అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

8 రోజులలో వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపారు. లైంగిక ఆరోపణలతో సొంత గ్రామానికి వెళ్లిన విజయ కృష్ణారెడ్డి.. పోలీసుల నోటీసులతో హైదరాబాద్ వచ్చారు. వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చి.. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments