భార్య ను దారుణంగా హత్య చేసి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు ఈ ఘటన బుధవారం సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైతలాపూర్ జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన రహీమ్, సుమేరా అనే దంపతులకు 2024 లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ అయిన రహీమ్‌కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. రోజూలాగే ఈరోజు తెల్లవారుజామున కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఆ వివాదం కాస్తా ముదరడంతో.. రహీమ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
క్షణికావేశంలో ఊగిపోతూ, ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్య సుమేరా గొంతు కోసి అక్కడికక్కడే హతమార్చాడు.భార్యను దారుణంగా చంపేసిన అనంతరం నిందితుడు రహీమ్.. నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘోర ఘటన పైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
