HomeTelanganaNizamabadబడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట.. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట.. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోందని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు.

ఆదివారం నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ చక్రవర్తిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

బలహీన వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, పంచాయతీ రాజ్ సంఘటన్ కమిషన్ సభ్యులు వేణుగోపాల్ యాదవ్, నుడా చైర్మన్ కేశవేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, సీనియర్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్లు ప్రవీణ్ యాదవ్, నరేందర్, కో-ఆప్షన్ సభ్యులు నరేంద్ర సింగ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments