మద్యం సేవించిన మైకంలో ఎస్సైగా పనిచేస్తున్న, అధికారిపై నా భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు తప్పుగా మాట్లాడానని ఓ హోంగార్డు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, అవస్తవమేమని ఆ హోంగార్డు వీడియోలో మాట్లాడుతు తెలిపారు. నా భార్య చాలా మంచిది.
ఎస్సైకు నా భార్యకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు.. నేను నా భార్య పై అనుమానంతోనే తాగిన మైకంలో అలా తప్పుగా మాట్లాడానని తెలిపారు.
ఈ సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోం గార్డు భార్య మాట్లాడుతూ.. నాకు నా భర్తకు చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయని, నన్ను తరచూ వేధిస్తూ ఉండేవాడని, నాపై ఎప్పుడు అనుమానంతోనే ఉండేవాడని, అదేవిధంగా ఎస్సైతో అక్రమ సంబంధం అంటగట్టారని ఆమె తెలిపారు.
ఇవన్నీ వాస్తవాలు కాదని అవస్తవాలేనని, నా భర్త తాగిన మైకంలో తప్పుగా ప్రవర్తిస్తాడని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని ఛానెల్ లో వాస్తవాలు తెలుసుకోకుండా నాపై తప్పుడు ప్రచారాలు చేశారని, వాస్తవాలు తెలుసుకొని వార్తలు వ్రాయాలని ఆమె పేర్కొన్నారు.
