HomeCRIME6వ టౌన్ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సందీప్..

6వ టౌన్ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సందీప్..

నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా సందీప్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న ఎస్‌ఐ యాదగిరి గౌడ్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో సందీప్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సందీప్ మాట్లాడుతూ..6వ టౌన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తాను నిరంతరం కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంపొందించేలా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్‌ఐకి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments