అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నఘటన సిద్ధిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ లో ఆదివారం వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన తొంట నర్సింలు(46) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహం కాగా, ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఒకేసారి పెళ్లి, ఇంటి నిర్మాణం చేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. శుక్రవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి మృతిచెందాడు.
