HomeTelanganaHyderabadతెలంగాణ ఐపీయల్ కు నాంది .......రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక ఆటగాళ్ల వేలం .........డిజిపి ఆనంద్...

తెలంగాణ ఐపీయల్ కు నాంది …….రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక ఆటగాళ్ల వేలం ………డిజిపి ఆనంద్ తనయుడు మిలింద్ ను సొంతం చేసు కున్న ఖమ్మం ఏసీసి ……తిలక్ ను సొంత చేసుకున్న మెదక్ ఫాల్కన్ …….మహ్మద్ సిరాజ్ ను వరంగల్ వారియర్స్

తెలంగాణ క్రీడ చరిత్ర లో ఆదివారం మరో మైలు రాయి కి పునాది పడింది. ఐపీఎల్ తరహాలోనే టీజీ 20 కి కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించారు తెలంగాణ ఆటగాళ్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తీసుకెళ్లడమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీజీ 20 లీగ్ . కు మొదటి కతృవు పూర్తీ అయింది ఆదివారం ఆటగాళ్ల వేలం పక్రియ రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక జరిగింది ఈ లీగ్‎లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి.

21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఇది వరకే నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు టీమిండియా స్టార్ క్రికెటర్స్ మహ్మద్ సిరాజ్ ,తిలక్ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్ కూడా వేలం బరిలో ఉన్నారు.

అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్‌తో పాటు హైదరాబాద్ యువ క్రికెటర్లు కూడా వేలంలో ఉన్నారు.ఈ వేలంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు, బౌలర్ సీవీ మిలింద్ జాక్ పాట్ కొట్టాడు.రూ.17 లక్షల భారీ ధరకు సీవీ మిలింద్‏ను ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

బేస్ ఫ్రైస్ రూ.5 లక్షలతో ఐకాన్ ప్లేయర్స్ కేటగిరీలో వేలంలోకి వచ్చిన మిలింద్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఆక్షన్‎లో చివరకు ఖమ్మం ఏసెస్ మిలింద్‎ను సొంతం చేసుకుంది. సీవీ మిలింద్ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, బ్యాటరైన మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు ఆడుతున్నాడు. హైదరాబాద్ సీనియర్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇండియా తరఫున U-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మిలింద్. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‎లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్ల తరుపు ఆడాడు

//// ఈ వేలంలో మొదటగా ఐకాన్ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించారు. ఐకాన్ కేటగిరీలో ఉన్న టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.

ముఖ్యంగా మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రయికర్స్ తిలక్ కోసం హోరాహోరీగా పోటీ పడ్డాయి.చివరకు రూ.33 లక్షల భారీ ధరకు మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మను దక్కించుకుంది. మరో స్టాయర్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్‎ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ కొనుగోలు చేసింది.

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు, బౌలర్ సీవీ మిలింద్‎ను రూ.17 లక్షలకు దక్కించుకుంది ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ. బ్యాటర్ పేరాల అమన్‎రావును రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది. ఆల్ రౌండర్ తనయ్ త్యాగరాజన్‎ను రూ.11 లక్షలకు కొనుగోలు చేసింది రంగారెడ్డి రైజర్స్. తన్మయ్ అగర్వాల్‎ను రూ.8 లక్షలకు దక్కించుకుంది కరీంనగర్ డైమండ్స్.

బ్యాటర్ బుద్ధి రాహుల్‎ను రూ.8 లక్షలకు కైవసం చేసుకుంది నల్గొండ నైట్స్. రాహుల్ రాయుడును రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది పాలమూరు స్ట్రయికర్స్. ఐకాన్ ఆటగాళ్ల కేటగిరీలో రాహుల్ సింగ్‎ను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.ప్రతి టీమ్‎కు రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయింపు.

ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది ప్లేయర్స్‎ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో టీమ్ కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. వేలం ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీల వారీగా జరుగుతుంది. గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహంగా ప్రతి టీమ్‎లో కనీసం 4 జిల్లాల ఆటగాళ్లు ఉండాలి. ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం రెండు జిల్లాల ప్లేయర్స్ ఆడటం తప్పనిసరి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments