HomeTelanganaHyderabadహైదారాబాద్ ను ముంచెత్తిన వర్షం .....అనేక ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్ .....మహిళా శక్తి సభ తో...

హైదారాబాద్ ను ముంచెత్తిన వర్షం …..అనేక ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్ …..మహిళా శక్తి సభ తో మరిన్ని ట్రఫిక్ చిక్కులు

హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు రెండు గంటలు ఏకధాటిన జోరు వర్షం నగరం ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, బేగంటపేట ఏరియాల్లో మోస్తరు వాన పడుతుంది.

అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ ఏరియాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతుంది. ఇక మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది.అబిడ్స్ , కోఠి , బషీర్ బాగ్  పరిసరాల్లో ఈదురుగాలులతో కురుస్తున్న వర్షం పడుతోంది. 

ఉప్పల్,నాగారం,అల్వాల్, నాచారం ,మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ ,లాలాపేట పరిసర ప్రాంతాలలో వర్షం కారణంగా వాహనదారులు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .అప్రమత్తం అయిన యంత్రాంగం

 మరో రెండు గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశంతో  ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.  రాబోయే రెండు మూడు గంటల్లో మోస్తారు వర్షం, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలలతో తో కూడిన వర్షం  హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ , కుమారం భీమ్ మంచిర్యాల,మెదక్ , మేడ్చల్ మల్కాజ్గిరి , నల్గొండ పెద్దపల్లె రాజన్న సిరిసిల్ల , రంగారెడ్డి , సంగారెడ్డి , సిద్దిపేట , యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

భారీ వర్షలతో నగరంలో అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడిగా వాహనాలు ముందుకు కదల లేకపోయాయి.

సికింద్రాబాద్ లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన డ్వాక్ర సంఘాల సభ కు మహిళలు బతుకమ్మ చీరెలు ధరించి వందలాది వాహనాల్లో నగరానికి తరలి వచ్చారు కానీ భారీ వర్షం వారంతా తీవ్ర ఇబ్బదులకు గురయ్యారు వర్షం తో సభ నిర్వహణ మొక్కుబడిగా ముగించారు కానీ తిరిగి వెళ్లలేక ట్రాఫిక్ లో చిక్కుక పోయారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments