టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ (ఆర్ఎమ్) టి. జోష్ణ బదిలీపై నల్గొండకు వెళ్తున్న సందర్భంగా, అలాగే డిప్యూటీ రీజియన్ మేనేజర్ (డిప్యూటీ ఆర్ఎమ్) పదోన్నతిపై మెదక్ రీజియన్ మేనేజర్గా వెళ్తున్న సందర్భంగా సోమవారం రీజియన్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, మెకానికల్ ఫోర్మెన్లు, రీజియన్ పి.ఓ పద్మజ, కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు తమ ఆత్మీయతను చాటుకుంటూ ఆర్ఎమ్, డిప్యూటీ ఆర్ఎమ్లకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. నిజామాబాద్ రీజియన్ అభివృద్ధిలో ఆర్ఎమ్ టి. జోష్ణ విశేష కృషి చేశారని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో ఎంతో చొరవ చూపారని కొనియాడారు. పదోన్నతిపై మెదక్ వెళ్తున్న డిప్యూటీ ఆర్ఎమ్కు వారు అభినందనలు తెలిపారు.
