హైదారాబాద్ నగరంలో బుధవారం ఉదయం మరోసారి కాల్పుల ఉదంతం కలకలం రేపింది.. మల్కాజిగిరి పరిధిలోని మారుతినగర్‍లో ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు నిషారాణిగా అరుణ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలున్నాయి వేరు వేరుగానే వుంటున్నారు .
బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని అరుణ్ పదే పదే ప్రాధేయ పడడంతో మాట్లాడానికి ఇంటికి పిలిచింది, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు అరుణ్ వచ్చి రాగానే తన వద్ద ఉన్న తుపాకీ తీసి భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
నిషారాణి అరుణ్ కు రెండో ఆమె ను భార్య హత్య చేసేందుకు అరుణ్ కుమార్ రెండు నెలల క్రితం నుంచే ఫ్లాన్ చేస్తున్నాడు . రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అరుణ్ గత మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో తుపాకీతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.
అంబర్ పేటలో నిర్వహించిన వాహనతనిఖీల్లో ఒక తుపాకీ, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడింతారు. మాల్కాజిగిరికి చెందిన అరుణ్ కుమార్ తన రెండవ భార్యను హత్య చేయడానికి బిహార్ నుంచి ఈ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు
