HomeTelanganaNizamabadదోస్త్‌కు ఉమ్మడి జిల్లాలో ఆదరణ కరువు........ప్రైవేట్ కు శరాఘాతం అయిన రియంబర్స్ మెంట్ ......ఏటా మూతపడుతున్న...

దోస్త్‌కు ఉమ్మడి జిల్లాలో ఆదరణ కరువు……..ప్రైవేట్ కు శరాఘాతం అయిన రియంబర్స్ మెంట్ ……ఏటా మూతపడుతున్న కాలేజీ లు

పేద విద్యార్థులకు మెరుగైన ప్రయివేట్ విద్య ను అందుబాటులోకి తేవాలని బృహత్తర లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం నీరుగారిపోతుంది. ప్రైవేట్ కాలేజీ లకు సైతం ఆర్థిక చేయూత ఉన్న ఈ పథకం ఇప్పుడు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు శరాఘాతం అయింది.

పేద విద్యార్థులకు బోధన చేసిన ప్రైవేట్ కాలేజీలకు సర్కార్ చిల్లి గవ్వఇవ్వడం లేదు. నేరుగా విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేసుకోవడానికి నిబంధనలు అంగీకరించడం లేదు అందుకే నిర్వహణ భారంగా మారి ఆర్థిక కష్టాలు అధిగమించలేక ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీలను మూసేసేస్తున్నాయి.

జిల్లా కేంద్రంలోనే గడిచిన మూడేళ్ళలో ఆరు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లు మూత పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ అడ్మిషన్లకు ఆశించిన స్థాయిలో జరగడం లేదు . జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లు భారీగా ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 52 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి 30,620 సీట్లను అందుబాటులో ఉంచారు.

అయితే ఇప్పటివరకు కేవలం 4,728 సీట్లలోనే ప్రవేశాలు నమోదయ్యాయి. మిగిలిన 25,892 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని కళాశాలల్లో చాలా చోట్ల 10 శాతానికి కూడా అడ్మిషన్లు నమోదు కాకపోవడం గమనార్హం. అయితే బోధన్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం అడ్మిషన్లలో ముందంజలో నిలిచింది. మిగతా కళాశాలల్లో ప్రవేశాల శాతం నిరాశాజనకంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విద్యార్థులు డిగ్రీ కోర్సుల కంటే ప్రొఫెషనల్, నైపుణ్యాధారిత కోర్సుల వైపు మొగ్గు చూపడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో స్పష్టత లేకపోవడం ప్రవేశాలపై ప్రభావం చూపుతున్న ప్రధాన కారణాలుగా విద్యావేత్తలు భావిస్తున్నారు.

మరోవైపు ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో కొందరు ఉద్యోగాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, ఇతర సాంకేతిక కోర్సులపై ఆసక్తి కనబరుస్తుండటంతో డిగ్రీ ప్రవేశాలు తగ్గినట్లు తెలుస్తోంది.దీంతో దోస్త్ తదుపరి విడతల్లో అయినా ప్రవేశాలు పెరుగుతాయా అనే అంశంపై కళాశాలల యాజమాన్యాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments