గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన సంచలనాత్మక హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా, చాకచక్యంగా దర్యాప్తు చేసి, ఇందులో భాగస్వాములైన నలుగురు (04) నిందితులన అరెస్ట్ చేశారు.
ఈ హత్య కు సంబంధించి వివరాలను టౌలీ చౌక్ ఏసీపీ వెల్లడించారు గోల్కొండ కుమార్వాడీ ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి 26 అనేయువకుడు ఈ నెల 12 న దారుణ హత్యకు గురయ్యాడు.సాయంత్రం , మృతుడి తండ్రి అయిన షేక్ ఇస్మాయిల్ పోలీసులకు ఒక ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.
ఆ ఫిర్యాదులోని ముఖ్యాంశాల ప్రకారం… ఫిర్యాదుదారుడి కుమారుడైన షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి, రుక్షార్ బేగమ్‌ను జనవరి 2025లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహం రుక్షార్ సోదరుడైన షేక్ జాహెద్ అలియాస్ సోహైల్‌కు అస్సలు ఇష్టం లేదు.
ఈ వివాహం కారణంగా షేక్ జాహెద్ మనసులో మృతుడిపై తీవ్రమైన పగ, ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ మృతుడితో గొడవలకు దిగేవాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో మృతుడికి ఒక కుమారుడు జన్మించాడు.
ఇలాంటి పరిస్థితుల్లో, గత సోమవారం నాడు షేక్ జాహెద్ తన తల్లి షమీమ్ బేగమ్, సోదరి రూబీలతో కలిసి కుమార్వాడిలోని మృతుడి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. రుక్షార్‌ను బలవంతంగా తమ ఇంటికి తీసుకువెళ్తూ… తన సోదరిని మసూద్ చండితో బతకనివ్వనని, వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తానని హెచ్చరించాడు.
ఈ గొడవల కొనసాగింపుగా,12.నాడు మధ్యాహ్నం సమయంలో, షేక్ జాహెద్ అలియాస్ సోహైల్ తన బంధువులైన (Cousin brothers) జీషన్ నవాబ్ అలియాస్ జాబర్, అమీర్ నవాబ్ అలియాస్ లడ్డు మరియు జాబర్ తల్లి నఫీజ్ సుల్తానాలతో కలిసి ఇనుప రాడ్లు, కత్తి, కర్రలతో కుమార్వాడిలోని తమ ఇంటిలోకి బలవంతంగా చొరబడ్డారు. అక్కడ ఉన్న షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
తాము వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితులు వినకుండా వారిని పక్కకు తోసివేశారు. మొదట షేక్ జాహెద్ అలియాస్ సోహైల్ ఇనుప రాడ్‌తో మృతుడి తలపై బలంగా కొట్టగా, జాబర్ కత్తితో తలపై మరియు శరీరంలోని ఇతర భాగాలపై విచక్షణారహితంగా పొడిచాడు.
అదే సమయంలో లడ్డు, అతని తల్లి నఫీజ్ సుల్తానా కలిసి కర్రలతో మృతుడి శరీరంపై తీవ్రంగా కొట్టారు. ఈ ఘోర దాడి కారణంగా తీవ్ర గాయాలైన షేక్ మహబూబ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అడ్డువెళ్లిన తన కూడా దాడి చేయడంతో కుడిచేతికి, కుడి చెంపపై రక్తగాయాలయ్యాయని బాధితుడు ఆ పిర్యాదు లో పేర్కొన్నారు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులను కోరారు.
నిందితుల అరెస్ట్ మరియు స్వాధీనం:విశ్వసనీయ సమాచారం మేరకు, టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో, గోల్కొండ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వేగంగా కదలి, 13 నాడు నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుండి దాడికి ఉపయోగించిన జిమ్ ఇనుప రాడ్ (Gym Iron Rod) కత్తి (Knife)లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వివరించారు
