ఉస్మానియా మెడికల్ కాలేజీలో ని డెంటల్ విభాగంలో ర్యాగింగ్ ఘటన నమోదు అయింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ నేరుగా పోలీసులకు పిర్యాదు చేయడం తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణల పై ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థుల పై కేసు నమోదైంది.
కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు టీ జీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాలేజ్ యాజమాన్యం ర్యాగింగ్ కు పాల్పడిన స్టూడెంటు 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు ఇచ్చారు. ప్రిన్సిపాల్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు.
