HomeTelanganaNizamabadప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి.. మరియు మున్సిపల్...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి.. మరియు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

3, 7, 39 డివిజన్లలో విస్తృత పర్యటన నిర్వహించిన మేయర్ మరియు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల అందజేత లక్ష్యంగా 3, 7, 39 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పలు కాలనీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ మరియు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు, డ్రైనేజీ కాలువల నిర్వహణ లోపాలు, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును ఓపికగా విన్న మేయర్, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన మేయర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.

చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం నగర పాలక సంస్థ ముఖ్య బాధ్యత అని అన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నగరాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, సమస్యలు ఉన్న చోట వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ శ్రీ నజీర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం విశేషంగా నిలిచింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments