నగరంలో వినాయక్ నగర్ లోని 22 డివిజన్ లో పారిశుధ్య పనుల ను స్పెషల్ డ్రైవ్ గా నిర్వహించారు స్థానిక డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి అభ్యర్థ మేరకు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది శుక్రవారం డివిజన్ లో ఏళ్ల తరబడిగా పూడిక తో కురుకు పోయిన మురికి కాల్వల్లో చెత్త చెదారం ను తొలగించారు
ఆయా ప్రాంతాల్లో చెత్త కుప్పలను సైతం తొలగించారు రాబోయే వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని మురికి కాల్వలను శుభ్రం చేయించడం తో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
