తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు అంకాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శనివారం జరిగిన వేడుకల్లో ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తన స్వగ్రామంలో మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
బతుకమ్మ సంబరాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు మహిళా సాధికారతకు ప్రతిబింబంగా నిలుస్తాయని పేర్కొన్నారు.వేడుకల్లో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. కార్యక్రమంలో గురడి రెడ్డి సంఘం సభ్యులు, గ్రామ మహిళలు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
