HomeCRIMEగంజాయి అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్‌4.368 కిలోల గంజాయి స్వాధీనం.. మరో నిందితుల కోసం పోలీసుల...

గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్‌4.368 కిలోల గంజాయి స్వాధీనం.. మరో నిందితుల కోసం పోలీసుల గాలింపు

గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని టౌన్‌-I పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 4.368 కిలోల గంజాయితో పాటు బ్యాగు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టౌన్‌-I పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18న నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ పారిపోయేందుకు ప్రయత్నించిన మల్కాపూర్‌ తండాకు చెందిన సలావత్‌ శ్రీనివాస్‌ (29)ను అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగును తనిఖీ చేయగా గంజాయి లభించింది.

పంచుల సమక్షంలో తూకం వేయగా 4.368 కిలోలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఒడిశాకు చెందిన పరిమల్‌ హర్దాల్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి, నాందేడ్‌కు చెందిన వాహిద్‌ ఖాన్‌ పాషాకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.

నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెందిన ఇబ్రహీం ఖాన్‌, గాంధారికి చెందిన నునావత్‌ మోహన్‌ గంజాయి అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇబ్రహీం ఖాన్‌ను కూడా సోమవారం అరెస్టు చేశారు.

సలావత్‌ శ్రీనివాస్‌, ఇబ్రహీం ఖాన్‌లను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments