కేటీఆర్ దమ్ముంటే మల్కాజ్‌గిరికి వచ్చి పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత్ రావు సవాల్ చేశారు. ఆయన శనివారం మీడియా తో మాట్లాడారు కాంగ్రెస్ నేతలపై, తమపై ఇష్టానుసారం మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఇకపై దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని తెలిసి కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని మైనంపల్లి సంచలన సవాల్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో దోచుకున్నారని ఆరోపణలు చేశారు. మంథనిలో అడ్వొకేట్ దంపతులను చంపిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తనేమిటి రుచి చూపిస్తామన్నారు
