హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్,సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి శనివారం మొహర్రం పండగ బందోబస్తు ఏర్పాట్ల ను తనిఖీ చేసారు పాత నగరంలోని బీబీ కా అలవాలో కొనసాగుతున్న మొహర్రం భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు .
పండగ సన్నాహాల్లో భాగంగా, సాంప్రదాయ ఏనుగుల ఊరేగింపు ఈరోజు ప్రారంభమైంది. ఊరేగింపు సజావుగా జరిగేలా చూసేందుకు కమిషనర్ మార్గాన్ని తనిఖీ చేసి, అవసరమైన అన్ని భద్రతా చర్యలను సమీక్షించారు.
ఈ తనిఖీ సమయంలో అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్,లున్నారు .శాంతియుతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మొహర్రం జరిగేలా చూసేందుకు, సున్నితమైన ప్రదేశాలలో మరియు ఊరేగింపు మార్గాలలో సుమారు 2,వేల మంది పోలీసు సిబ్బందినిమోహరించి నట్లుగా సజ్జనార్ పేర్కొన్నారు
