పీసీసీ లో నియామకాల మీద ఓ వైపు వివాదం చెలరేగుతుంటే పీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గం అర్బన్ కాంగ్రెస్ పార్టీలో నియామకాలు చిచ్చులేపాయి. అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తీరు ఫై సీనియర్ నేతలు రగిలి పోతున్నారు.పార్టీ లో కనీసం ప్రాతినిధ్యం కూడ లేని అనామకులకు డివిజన్ అధ్యక్షులుగా నియమించడం వెనుక అనేక వ్యవహారాలు నడిచాయనేది వారి వాదన.
ఈ వ్యవహారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ దాక వెళ్లడం తో ఆయన నియామకాల వెనుక సాగిన తతంగంఫై అవాక్కు అయ్యారని చెప్తున్నారు అందుకే నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ మరియు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు డివిజన్ అధ్యక్షులను నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూనట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ ప్రకటించారు.
నిజామాబాద్ అర్బన్ రూరల్ లతో ఆర్మూర్ డివిజన్ లకు కొత్త అధ్యక్షులను నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ప్రకటించారు ఆయన కూడా పీసీసీ ఆదేశాల మేరకే నియామక ఉత్తర్వ్యూలను 30 మే జారీ చేసారు కానీ ఆ నియామక ఉత్తర్వులను ఉన్నపలంగా నిలిపివేడం ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
డివిజన్ లకు కొత్త అధ్యక్షుల నియామకం లో తమను కనీసం సంప్రదించక పోవడాన్ని కొందరు సీనియర్లు ఆక్షేపిస్తున్నారు. కార్పొరేటర్ల ప్రాతినిధ్యం ఉన్న డివిజన్ లలో సైతం వారికి కనీస సమాచారం ఇవ్వకుండా అధ్యక్షులుగా నియమించారని చెపుతున్నారు మైనార్టీ డివిజన్ తీవ్రమైన నేర చరిత్ర ఉండడమే కాకుండా యంఐయం లో చురుకుగా ఉన్న వారికి డివిజన్ బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద తతంగమే సాగిందని ప్రచారం జరుగుతుంది
అసలు పార్టీ కార్యకలాపాల్లో కనీస పనిచేయని వారికి సైతం పదవి కట్టబెట్టడం ఫై సీనియర్లు రుస రుస లాడుతున్నారు పార్టీ సభ్యత్వం లేని వారికి ఏకంగా అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని సైతం తప్పుపడుతున్నారు ఎహే మొన్నటి ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ లు కొత్తవారికి ఇచ్చాం కదా కొత్తవారికి అధ్యక్ష పదవి ఇస్తే అభ్యంతరం ఎందుకు చేస్తున్నారని రామకృష్ణ వర్గం చెప్తుంది.
ఎలాగో ఆయన పట్టించుకునే పరిస్థితి లేక పోవడంతో సీనియర్లు నేరుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు ఓడిన కార్పొరేటర్ లు గెలిచిన కార్పొరేటర్లు తో ఒకరిద్దరు కీలక నేతలు సైతం నియామకాలపై పిర్యాదు చేసారని సమాచారం అందుకే ఆయన తాత్కాలికంగా నిలిపివేశారని సమాచారం
